డిప్యూటీ సీఎం ఫోన్‌ నుంచి ఫోర్న్‌ క్లిప్‌ షేరింగ్‌

20 Oct, 2020 15:37 IST|Sakshi

పనాజీ : గోవా ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవేల్కర్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన ముబైల్‌ ఫోన్‌ నుంచి ఒక వాట్సప్‌ గ్రూప్‌కు పోర్న్ క్లిప్‌ ఫార్వర్డ్‌ అయింది. ఓ ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ఫోన్ నుంచి తమకు అందిన ఆ పోర్న్ వీడియోలను చూడగానే వాట్సాప్‌ గ్రూపు సభ్యులు షాకయ్యారు.  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపించాలని విజ్ఙప్తి చేశారు. కాగా, ఈ  ఘటనపై డిప్యూటీ సీఎం కవెల్కర్‌ స్పందించారు. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని, వారిని పట్టుకోవాలని శిక్షించాలని కోరారు. ఈ మేరకు సైబర్‌ సెల్‌ విభాగానికి ఫిర్యాదు చేశారు. 

‘ నేను చాలా వాట్సాప్ గ్రూపులలో మెంబర్‌గా ఉన్నాను. ఫోన్ హ్యాక్ చేసిన వాళ్లు కావాలనే ‘విలేజెస్ ఆఫ్ గోవా’ గ్రూపులో ఆ క్లిప్‌ను ఫార్వర్డ్ చేశారు. మిగతా ఏ గ్రూప్‌కు ఈ క్లిప్ పంపలేదు. ఆ క్లిప్ గ్రూప్‌లో ఆదివారం రాత్రి 1:20 గంటలకు ఫార్వర్డ్ అయింది. ఆ సమయంలో నిద్రపోతున్నాను. గతంలో కూడా నా పేరును, నా పరువును కించపరచడానికి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. నేరపూరితంగా కావాలనే నా ఫోన్ హ్యాక్ చేసిన దుర్మార్గులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎదుర్కోలేక ఈ పని చేశారు’అని కవెల్కర్‌ ఆరోపించారు. 

కాగా, పోర్న్‌ క్లిప్‌ షేరింగ్‌పై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ప్రవర్తన అసభ్యకరంగా ఉందని మండిపడుతోంది. ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నాయకులు. సామాజిక కార్యకర్తలను అవమానపర్చడానికి, వారిని కించపర్చడానికే చంద్రకాంత్ కవ్లేకర్ ఉద్దేశపూరకంగా పోర్న్ వీడియోలను పంపించి ఉంటారని మండిపడుతున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా