కోడింగ్‌ బాయ్‌

14 Jan, 2021 08:45 IST|Sakshi
తల్లిదండ్రులతో కోడిండ్‌ బాయ్‌ వెంకట్రామన్‌

భువనేశ్వర్‌ : ప్రజంట్‌ జనరేషన్‌ పిల్లలంతా  తమ ప్రతిభాపాటవాలతో వండర్‌ కిడ్స్‌గా పేరు గడిస్తున్నారు. తాజాగా ఒడిషాలో బాలంగీర్‌ ప్రాంతానికి  చెందిన ఏడేళ్ల వెంకట్‌ రామన్‌ పట్నాయక్‌ ఈ లిస్టులో చేరాడు. బీటెక్,ఎంసీఏ చదివిన విద్యార్థులే కోడింగ్‌ సరిగ్గా అర్థంకాక పొగ్రామ్స్‌ రాయడానికి కుస్తీలు పడుతుంటారు.అటువంటిది మూడో తరగతి చదువుతున్న వెంకట్‌ రామన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ఎగ్జామ్‌ను ఇట్టే క్లియర్‌ చేశాడు. జావా, జావా స్క్రిఫ్ట్, పైథాన్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫండమెంటల్స్‌లో మొత్తం 160 క్లాసులకు హాజరై ఆయా కోర్సుల్లో పట్టుసాధించాడు. అంతేగాక సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ నిర్వహించే మైక్రోసాఫ్ట్ట్‌ టెక్నాలజీ అసోసియేట్‌ (ఎంటీఏ) ఎగ్జామ్‌ రాసి ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్‌ను పొందాడు. (చదవండి: ఈ ‘కోడ్‌’ తప్పదిక)

2019 మార్చిలో ఓ యాప్‌ ద్వారా కోడింగ్‌ పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించిన వెంకట్‌ ఏడేళ్ల వయసులోనే ఏకంగా 250 అప్లికేషన్స్‌కు కోడింగ్‌ రాసి ఔరా అనిపించాడు. ఒకప్పుడు టెక్నాలజీ పిల్లలకు ఆమడదూరంలో ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో చూపే టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.   

మరిన్ని వార్తలు