రైలు ప్రమాదం మరణాలపై సర్వత్రా ఆరోపణలు..ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన ఒడిశా ప్రధాన కార్యదర్శి

5 Jun, 2023 10:26 IST|Sakshi

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య విషయమై సర్వత్రా పెద్ద ఎత్తున​ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఒడిశా ప్రధాన కార్యదర్శి పీకే జెనా ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే మీడియా ప్రతినిధులు ఎక్కువగానే ఉన్నారని, అంతా కెమెరాల సమక్షంలోనే జరుగిందని చెప్పారు. ఒడిశా పారదర్శకతనే విశ్విస్తుందని నొక్కి చెప్పారు. వాస్తవానికి రైల్వే మరణాల సంఖ్య 288గా పేర్కొంది. దీన్ని రైల్వే సమాచారం ఆధారంగా వెల్లడించింది.

ఐతే బాలాసోర్‌ జిల్లా కలెక్టర్‌ ఆదివారం మరణాల సంఖ్యను 275గా ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే మరణాల సంఖ్యను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీని గురించి పీకే జెనా మృతదేహాలను రెండుసార్లు లెక్కించడం వల్ల ఇలా జరిగిందంటూ వివరణ ఇచ్చారు. అలాగే ప్రమాద స్థలంలో మీడియా వ్యక్తుల ప్రవేశంపై నిషేధం కూడా లేదని ప్రధాన కార్యదర్శి తెలిపారు.

రెస్క్యూ, పునురుద్ధరణ కార్యకలాపాలు పూర్తిగా ప్రజల సమక్షంలోనే జరిగాయిని చెప్పారు. ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరణాల సంఖ్య గురించి ప్రశ్నించారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు 61 మంది మరణించారని, 182 మంది ఆచూకి తెలియలేదని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం నుంచి 182 మంది ఆచూకి తెలయలేదంటే ఆ గణాంకాలు ఎలా నిలుస్తాయి అని నిలదీశారు.

ఐతే మమతా బెనర్జీ ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలను స్వీకరించేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ నిరాకరించారు. కాగా, 275 మృతదేహాలలో 108 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించినట్లు ప్రధాన కార్యదర్శి జెనా తెలిపారు. అలాగే మృతదేహాలను వారి కుటుంబసభ్యులు దహనం చేసేందుకు వీలుగా అన్ని మృతదేహాలను గుర్తించాలని రాష్ట్రం కోరుకుంటుందని జెనా అన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం దృష్ట్యా అవి త్వరిగతిన పాడేపోతున్నాయని, అందువల్ల చట్టం ప్రకారం రాష్ట్రం గరిష్టంగా మరో రెండు రోజులు మాత్రమే వేచి చూస్తుందని చెప్పారు.

(చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: బోగీలో నుంచి పిల్లలను బయటకు విసిరేసి...)

>
మరిన్ని వార్తలు