Odisha: హిజ్రాలకు పోలీసు ఉద్యోగాలలో అవకాశం..

13 Jun, 2021 17:51 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, భువనేశ్వర్‌(ఒడిశా): హిజ్రాలకు పోలీసు విభాగంలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు అభయ్‌ శనివారం ప్రకటించారు. ఈ మేరకు 477 సబ్‌–ఇన్‌స్పెక్టర్, 244 కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ అయింది. దరఖాస్తు గడువు జూలై 15వ తేదీతో ముగుస్తుంది.

సాధారణ అభ్యర్థులతో పాటు హిజ్రాలు కూడా ఈ  ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.  సబ్‌– ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి విద్యార్హత డిగ్రీ కాగా కానిస్టేబుల్‌ ఉద్యోగానికి +2 శ్రేణి అర్హతగా పేర్కొన్నారు.  

చదవండి:  వైరల్‌ వీడియో.. ఆ కుక్క చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి

మరిన్ని వార్తలు