వధువు వాళ్లు మటన్‌ వండలేదని మరో అమ్మాయితో పెళ్లి!

25 Jun, 2021 12:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భువనేశ్వర్‌: సాధారణంగా వివాహవేడుకలో అ‍ప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వధువు తరపువారు, వరుడి వైపు బంధువులని సరిగ్గా పలకరించలేదనో.. పెళ్లిలో వసతులు సరిగ్గా లేవని అలిగిన సంఘటనలు మనకు తెలిసిందే. మరికొన్ని చోట్లలో మగ పెళ్లి వారు అడిగినంత కట్నం ఇవ్వలేదని, చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకుని మండంపైన వివాహలు ఆగిపోయిన సందర్భాలు కొకొల్లలు. తాజాగా ఒడిశాలో జరిగిన వివాహం కాస్త వెరైటీ కారణంతో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వివరాలు.. కియోంజర్‌ జిల్లాలోని మానతీరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాగా, పెళ్లి వేడుకలో భాగంగా ఒక రోజు ముందు.. మగ పెళ్లివారు బంధువులతో కలిసి బరాత్‌గా వధువు ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ దావత్‌లో వరుడి బంధువులు మటన్‌ కావాలని అడగగా.. ఆడపెళ్లివారు వండలేదని సమాధానం చెప్పారు. దీంతో వరుడి తరపు వారు ఆగ్రహంతో ఊగిపోయారు. కాసేపటికి, ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగింది. దీంతో అక్కడ స్వల్ప ఘర్శణ వాతావరణం తలెత్తింది. అనంతరం పెళ్లి కొడుకు వివాహన్ని రద్దు చేసుకుని తమ బంధువులతో కలిసి గంధాపాల గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు.

ఆ మరుసని రోజే తమ్కా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పులజారా ప్రాంతానికి చెందిన మరో యువతితో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ఇదేం.. పైత్యం వాళ్లకి..’, ‘వరుడికి.. బుధ్దుందా అసలు..’, ‘బ్రో.. మీరు ఎప్పుడు మారతారు..’, ‘పాపం.. అమ్మాయి పరిస్థితి ఏంటో..’, ‘ ఇలాంటి శాడిస్టు భర్త నీకేందుకు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

చదవండి:  ఆమె ఆరోగ్యం బాగు చేయడానికి ఆ దేవుడే ఇలా వచ్చాడేమో!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు