పెళ్లి మండపంలోనే పెళ్లి వద్దని తెగేసి చెప్పిన వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు

21 May, 2022 21:29 IST|Sakshi

ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసుకునే వివాహల్లో ఈ మధ్య కాస్త అపసృతులు చోటు చేసుకుంటున్నాయి. ఏవో చిన్న చిన్న వాటికే పెళ్లి మండపంలోనే అందరుముందు వధువరులు కొట్టుకుంటున్న ఘటనలు చూశాం. మర్యాదలు మంచిగా లేవంటూ మరికొంతమంది పెద్దలు పెళ్లిమండంపంలోనే గొడవపడి నరుక్కునేంతవరకు వెళ్లిన ఉదంతాలు గురించి విన్నాం. అవన్ని ఒకతంతు ఐతే వాటన్నింటికి భిన్నంగా ఒడిశాలో జరిగిన వివాహతంతులో ఒక వింత ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...ఒడిశాలో జరిగిన వివాహతంతులో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. బాలాసోర్ జిల్లా బలియాపాల్ పరిధిలోని రేము గ్రామంలో అంగరంగ వైభవంగా వివాహతంతు జరుగుతోంది. ఇంతలో ఏమైందో ఏమో వధువు అకస్మాత్తుగా లేచి తాను వేసుకున్న నగలు, గాజులు తీసేసి ఈ పెళ్లి వద్దని చెబుతుంది. దీంతో ఆ మండపం వద్ద ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌ అవుతారు.

అక్కడ ఉన్న పెద్దలు పెళ్లి కూతురిని తిడుతూ బలవంతంగా కూర్చొబెట్టేందుకు యత్నిస్తుంటారు. ఈ తంతంగాన్ని చూసి తట్టుకోలేక వరుడు స్పృహ తప్పి పడిపోతాడు. దీంతో అక్కడ ఉన్నావారంతా భయాందోళనకు గురవుతారు. ఐతే వరుడు కాసేపటికి తేరుకుని మరో అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ప్రస్తుతం ఈ విషయం తాజాగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: యజమాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి సింహంతో పోరాడిన కుక్క)

మరిన్ని వార్తలు