లాక్‌డౌన్‌ ఉల్లంఘన: 2 వేల బైక్‌లు సీజ్‌

17 May, 2021 10:40 IST|Sakshi

బరంపురం: నగరంలో లాక్‌డౌన్, షడ్‌డౌన్‌లతో పాటు నైట్‌ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. గత పది రోజులుగా సుమారు 2వేలకు పైగా మోటార్‌ వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. 832 మందిపై కేసులు నోమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు ఎస్‌డీపీఓ బిష్ణుప్రసాద్‌ పాత్రో తెలిపారు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దని, నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రూ.41 వేల జరిమానా.. 
రాయగడ: కరోనా నియంత్రణలో భాగంగా అమలు చేస్తున్న వారాంతపు షట్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కల్యాణసింగుపూర్‌ పోలీసులు కొరడా ఝులిపించారు. ఐఐసీ సుకుమా హంసద్‌ ఆధ్వర్యంలో పోలీసులు కల్యాణసింగుపూర్‌లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రూ.41వేలు జరిమానా విధించినట్లు ఐఐసీ అధికారి తెలిపారు. ఏఎస్‌ఐ డీకే సాహు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు