Egg Attack On Odisha MP Vehicle: మహిళా ఎంపీకి చేదు అనుభవం.. కోడిగుడ్ల దాడి

26 Nov, 2021 16:32 IST|Sakshi
ఒడిశా బీజేడీ ఎంపీ అపరాజిత సారంగి (ఫైల్‌ ఫోటో)

ఒడిశా బీజేడీ ఎంపీ అపరాజిత సారంగి వాహనంపై కోడిగుడ్ల దాడి

ఎంపీ ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌

భువనేశ్వర్‌: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు కోడిగుడ్ల దాడి చేయడంతో ఒడిశాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కాన్వాయ్‌పై దాడి జరగిన మరుసటి రోజే.. ఓ మహిళా ఎంపీకి ఇదే రీతిలో చేదు అనుభవం ఎదురయ్యింది. కాంగ్రెస్‌ మద్దతుదారులు  బీజేడీ ఎంపీ అపరాజిత సారంగిని టార్గెట్‌ చేశారు. ఆమె వాహానంపై కోడిగుడ్లు విసిరారు. 
(చదవండి: ఒడిశా సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి)

ఈ సంఘటన శుక్రవారం భువనేశ్వర్‌ బనమలిపూర్‌లో చోటు చేసుకుంది. నిరుద్యోగం, నిత్యసరాల ధరలు, ఇంధన ధరలు పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎంపీ అపరాజిత సారంగి వాహానాన్ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్‌ మద్దతుదారులు.. దానిపై కోడిగుడ్లు విసిరారు. నల్ల జెండాలు చూపి నిరసన వ్యక్తం చేశారు. 
(చదవండి: అథ్లెట్‌ ద్యుతి చంద్‌ ఫిర్యాదు.. ‘ఫోకస్‌ ప్లస్‌’ ఎడిటర్‌ అరెస్టు)

ఈ క్రమంలో జరిగిన సంఘటన గురించి అపరాజిత సారంగి తన స్వస్థలం ధనేశ్వర్‌ బారిక్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసనకారుల రాళ్లు కోడిగుడ్లతో తన వాహనంపై దాడి చేశారని.. వారి వద్ద కత్తులు, ఇతర మారణాయుధాలు ఉన్నాయని ఎంపీ తన కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. 

చదవండి: ఒడిశాలో పతీసహగమనం.. భార్య మరణం తట్టుకోలేక


 

మరిన్ని వార్తలు