కరోనాను జయించిన నవజాత శిశువు

15 May, 2021 18:09 IST|Sakshi

భువనేశ్వర్‌: దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రత కారణంగా రోజూ వేలది సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అంతటి భయంకరమైన మహమ్మారిపై ఓ నవజాత శిశువు వెంటిలేటర్‌పై 10 రోజుల పోరాడి విజయం సాధించాడు. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. ఈ శిశువుకు చికిత్స చేసిన వైద్యుడు మాట్లాడుతూ.. ప్రాణాంతక వైరస్‌తో మూడు వారాల పోరాటం తర్వాత కోలుకోగా. ఈనెల  12వ తేదీన  ఆ శిశువుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.

10 రోజులు వెంటలేటర్‌పై పోరాటం
ఛత్తీస్‌గఢ్‌లోని కలహండి జిల్లాకు చెందిన అగర్వాల్‌ భార్య ప్రీతి అగర్వాల్‌ ఇటీవల ఓ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన 15 రోజులకే జ్వరం రావడంతో అగర్వాల్‌ దంపతులు భువనేశ్వర్‌లోని జగన్నాథ్‌ ఆస్పత్రికి  తీసుకువెళ్లారు. ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సమక్షంలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఆ శిశువుకు పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ శిశువుకు చికిత్స చేసిన నియోనటాలజిస్ట్‌ డాక్టర్‌ అరిజిత్‌ మోహపాత్ర మాట్లాడుతూ.. నవజాత శిశువు కాబట్టి వెంటిలెటర్‌పై ఉంచామని, రెమ్‌డెసివిర్‌తో సహా ఇతర యాంటీబయాటిక్స్‌ ఇచ్చినట్లు చెప్పారు. తల్లిదండ్రుల అనుమతితో రెమ్‌డెసివిర్‌ను ఇంజెక్షన్‌ ఇచ్చాము. చివరకు చికిత్స సానుకూలంగా స్పందించి, కోలుకున్నట్లు తెలిపారు. పుట్టిన వెంటనే తమ చిన్నారికి వైరస్‌ సోకడంతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. పది రోజుల్లో ఆ శిశువు కోలుకొని కరోనా పై విజయం సాధించడంతో ఇప్పుడు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

( చదవండి: బెలూన్లు ఊది.. ఒక్క ఊపిరితిత్తితోనే కరోనాను జయించిన నర్సు )

>
మరిన్ని వార్తలు