వీధి కుక్కతో పెళ్లి.. ఇదేం ఆచారం రా బాబు!

11 Mar, 2022 21:16 IST|Sakshi

భువనేశ్వర్‌:  పూర్వకాలంలో ఆచారాలు పేరుతో కొన్ని అనాగరిక కార్యక్రమాలు జరిగేవి. మారుతున్న కాలంతో పాటు చాలావరకు మూఢనమ్మకాలు, అనాగరిక కార్యక్రమాల నంచి ప్రజలు బయటపడ్డారు. అయితే కొన్ని ఆచారాలు మాత్రం అక్కడో ఇక్కడో గ్రామల్లో ఇంకా కనిపిస్తునే ఉన్నాయి. తాజాగా ఈ తరహా ఆచారం ఒకటి ఒడిశాలోని కరగోలాలో వెలుగు చూసింది. ఆ గ్రామస్తులు ఏకంగా ఓ చిన్నారికి వీధికుక్కతో పెళ్లి జరిపించారు. దీని వెనుక కారణం కూడా ఉందని చెప్తున్నారు.

బాలికకు పాలదంతాలు మొదట దవడ భాగంలో వచ్చాయని, అది అశుభానికి గుర్తుగా భావించి వివాహం చేశామాని పెద్దలు చెప్పారు. వారు ఈ ప్రత్యేకమైన ఆచారాన్ని నిర్వహించకపోతే, భవిష్యత్తులో అది పిల్లలకి ప్రమాదకరం అని కూడా నమ్ముతారు. అందుకే ఆ చిన్నారికి కుక్కతో పెళ్లి చేశామన్నారు. పాలదంతాలు దవడ భాగంలో వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఇలానే చేస్తామని చెపారు. అయితే పేరుకి ఇది ఆచారమే అయినప్పటికీ స్థానికుల మధ్య పూర్తి అలంకరణ, హంగామ, విందుతో వివాహం జరుగుతుంది. అవగాహన లేకపోవడంతో ఈ సంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగుతోందని చెప్పాలి.

మరిన్ని వార్తలు