హాస్టల్‌ భోజనంలో చచ్చిన కప్ప.. షాకైన విద్యార్థి

24 Sep, 2023 15:58 IST|Sakshi

రెస్టారెంట్‌, హోట్సల్‌, హాస్టల్స్‌, ఇలా ప్రతిచోట  సర్వ్‌ చేస్తున్న భోజనంలో కీటకాలు, పురుగు దర్వనమిస్తుండటం కలవరం రేపుతోంది. భోజనంలో బల్లులు, ఎలుకలు, బొద్దింకలు, కప్పలు కనిపించడం  ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒడిశాలో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది.

భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ టెక్నాలజీ(కేఐఐటీ) హాస్టల్‌ భోజనంలో ఓ విద్యార్థికి చచ్చిన కప్ప ప్రత్యక్షమైంది. కేఐఐటీ భువనేశ్వర్‌ విద్యార్థి ఆర్యన్ష్‌ హాస్టల్‌లో భోజనం చేస్తుండగా పేరుగన్నంలో కప్ప కనిపించింది. దీంతో ఖంగుతున్న విద్యార్థి వెంటనే ఆ ఆహారాన్ని పడవేశాడు. తనకు ఎదురైన అనుభవాన్ని విద్యార్థి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్‌ చేస్తూ విద్యాసంస్థల్లో పరిస్థిని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
చదవండి: డిసెంబర్‌లోనే అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ సేవలు!

‘ఇది దేశంలోనే ఇంజనీరింగ్‌ కళాశాలలో 47వ ర్యాంక్‌ కలిగిన కేఐటీ భువనేశ్వర్‌ కాలేజ్‌. ఇక్కడ ఓ విద్యార్థి తమ డిగ్రీని పూర్తి చేసేందుకు తల్లిదండ్రులు దాదాపు 17.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అంత డబ్బులు తీసుకుని కాలేజీ హాస్టల్‌లో ఇలాంటి ఆహారాన్ని అందిస్తున్నారు. మెరుగైన విద్య, సౌకర్యాల కోసం ఇండియా నుంచి విదేశాలకు ఎందుకు విద్యార్థులు  వలస వెళ్తున్నారో మాకు ఇప్పుడు అర్థమవతుంది’ అని ఆహారంలో కప్ప కనపడిన ఫోటోను షేర్‌ చేశాడు.

ఆర్యాన్ష్‌ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కేఐఐటీ కళాశాల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోస్టు చేసిన కొన్ని గంటలకే స్పందించిన కళాశాల యాజమాన్యం మెస్‌ కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. హాస్టల్‌లో అందిస్తున్న ఆహారం పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని, భోజనంపై విద్యార్థులు అసంతృప్తి చెందారని ఇనిస్టిట్యూట్‌ పేర్కొంది. కిచెన్‌, స్టోర్‌, వంట సరుకులు పరిశుశ్రంగా ఉంచుకోవాలని, ఆహారం తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తూ.. పనిష్‌మెంట్‌గా ఓ రోజు పేమెంట్‌ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

అయితే కేవలం ఒక్క రోజు పేమెంట్‌ను మాత్రమే కట్ చేస్తూ తమ వర్సిటీ స్పందించిన తీరుపై ఆర్యాన్ష్ మండిపడ్డాడు. వర్సిటీ పరువును కాపాడుకోవడానికే ఈ చర్య తీసుకుందని, మనిషి జీవితానికి ఉండే విలులు ఇదేనని అసహనం వ్యక్తం చేశాడు. 

మరిన్ని వార్తలు