ఒడిశా నుంచి చెన్నై బయలుదేరిన ప్రత్యేక రైలు.. బాధితుల వివరాలివే..

3 Jun, 2023 18:36 IST|Sakshi

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 280 మంది ప్రాణాలు కోల్పోయారు. 900 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించిన ఏపీ వాసుల్లో 267 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. 113 మంది ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తున్నట్లు పేర్కొన్నారు. 82 మంది రైలులో ప్రయాణించలేదని తెలిపారు.

మరోవైపు బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించిన ఏపీ వారిలో 49 మంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయని తెలిపారు. 28 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తుండగా .. 10 మంది ట్రైన్‌లో ప్రయాణించలేదని చెప్పారు.
చదవండి: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. ఏపీ సర్కార్‌ కీలక ప్రెస్‌మీట్‌ 


రెండు రైళ్లలో ఏపీకి చెందిన వారి ప్రయాణికుల వివరాలు

ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 250 మందిని ప్రత్యేక రైలులో తమ గమ్యస్థానాలకు బయల్దేరినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు P/13671 భద్రక్ స్టేషన్‌ నుంచి బయల్దేరి చెన్నైకు చేరుకోనుందని పేర్కొన్నారు. ఈ రైలు ఇవాళ రాత్రి 9.30కి విజయవాడ రానుంది.అక్కడ 9 మంది ప్రయాణికులు దిగుతారని అధికారులు చెప్పారు

ఈ ప్రత్యేక రైలులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు బరంపురంలో, 41 మంది విశాఖపట్నంలో, ఒకరు రాజమహేంద్రవరంలో, ఇద్దరు తాడేపల్లి గూడెంలో, 133 మంది చెన్నైలో దిగుతారు. ఈ రైలు ఆదివారం చెన్నై చేరుకుంటుంది. కాగా ఒడిశాలోని బాలాసోర్‌ శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 280 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు 900 మందికి పైగా క్షతగాత్రులైనట్లు అధికారులు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు