గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌పై యువకుడి గురి

5 Apr, 2021 14:11 IST|Sakshi

కొరాపుట్‌/ ఒడిశా‌: పుష్‌ అప్స్‌లో గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సొంతం చేసుకునేందుకు కొరాపుట్‌కు చెందిన యువకుడు పట్టుదలతో సాధన చేస్తున్నాడు. స్థానిక నవభారత్‌ కాలనీకి చెందిన దేబేంద్రనాథ్‌ పరిఛ కుమారుడు రాజేష్‌కుమార్‌ పరిఛ 30 సెకన్లలో ముంజేతిపై ఒకేసారి ఆగకుండా 79 పుష్‌–అప్స్‌ తీసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.

ఇక ఇప్పటి వరకు ముంజేతిపై ఆపకుండా 135 పుష్‌–అప్స్‌ తీసిన వ్యక్తి పేరుతో గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు ఉండగా.. రాజేష్‌ పరిఛ 150 పుష్‌–అప్స్‌ తీసుకున్నాడని అతని కోచ్‌ సిమాంచల్‌ మిశ్రో తెలిపారు.అదే విధంగా, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు దరఖాస్తు చేసినట్లు చెప్పారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రాజేష్‌కుమార్‌ పరిఛ ఆదివారం తన క్రీడా విన్యాసాలు ప్రదర్శించి ఔరా అనిపించాడు. ముంజేతిపై ఒకే పర్యాయంలో 170 పుష్‌–అప్స్‌ తీసేలా సాధన చేస్తున్నానని, గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకోవడమే తన ధ్యేయమని రాజేష్‌ మీడియా ప్రతినిధులతో అన్నారు. 

చదవండి: రహదారుల నిర్మాణంలో ప్రపంచ రికార్డు
రూబిక్‌ క్యూబ్‌తో ప్రపంచ రికార్డు! 

మరిన్ని వార్తలు