కోళీకోడ్‌ ఘటన: 22మంది అధికారులకు కరోనా

14 Aug, 2020 15:16 IST|Sakshi

తిరువనంతపురం: కోళీకోడ్‌ విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాటి విమాన ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సహా 18 మంది మరణించారు. అయితే తాజాగా శుక్రవారం మరోక షాకింగ్‌ న్యూస్‌ తెలిసింది. విమాన ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మలప్పురానికి చెందిన 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది. ఈ మేరకు మలప్పురం జిల్లా వైద్యాధికారి ప్రకటన చేశారు. ప్రస్తుతం వీరంతా హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ వార్త ఇప్పటికే బాధితులను భయపెడుతోంది. దీని గురించి కేరళ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే దాని గురించి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. (చిమ్మచీకట్లో మిన్నంటిన రోదనలు)

దుబాయ్‌ నుంచి వచ్చిన విమానం కోళీకోడ్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అవుతున్న క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండుగా విరిగిపోయింది. ముందు భాగం పూర్తిగా ధ్వంసమవడంతో ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు