-

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

6 Jul, 2021 14:01 IST|Sakshi

భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌.. జూనియర్‌ అసిస్టెంట్‌(క్లర్క్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 120(ఎస్సీ–08, ఎస్టీ–14, ఓబీసీ–32, ఈడబ్ల్యూఎస్‌–12, అన్‌రిజర్వ్‌డ్‌–54)

అర్హత: కనీసం 40శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్‌(10+2)ఉత్తీర్ణతతోపాటు కనీసం 6 నెలల వ్యవధితో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిప్లొమా సర్టిఫికేట్, ఎంఎస్‌ వర్డ్, ఎంఎస్‌ పవర్‌పాయింట్, ఎంఎస్‌ ఎక్స్‌ఎల్‌లో మంచి నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 15.08.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు  రూ.26,600 నుంచి రూ.90,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. 

► ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌/అవేర్‌నెస్, ఆయిల్‌ ఇండియాపై ప్రశ్నలకు  20 శాతం మార్కులు కేటాయిస్తారు. 

► రీజనింగ్, అర్థమేటిక్‌/న్యూమరికల్‌ అండ్‌  మెంటల్‌ ఎబిలిటీకి 20శాతం మార్కులు కేటాయిస్తారు. 

► డొమైన్‌/సంబంధిత టెక్నికల్‌ నాలెడ్జ్‌(సంబంధిత పోస్టు విద్యార్హతల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి)కు 60శాతం మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నలు మల్టిఫుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. నెగిటివ్‌ మార్కింగ్‌ లే దు. పరీక్ష ఇంగ్లిష్, అస్సామీ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షాసమయం రెండు గంటలు. తుది ఎంపిక రాతపరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఉంటుంది.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021

► వెబ్‌సైట్‌: https://www.oil-india.com/Current_openNew.aspx

మరిన్ని వార్తలు