దంపతుల డ్యాన్స్‌.. మనసు దోచేయడం ఖాయం

30 Jan, 2021 21:41 IST|Sakshi

కోల్‌కతా: ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సోషల్‌ మీడియా ద్వారా క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. కొందరు తాము చేస్తున్న పని ద్వారా తమకు తెలియకుండానే ఫేమస్‌ అయిపోతారు. సరిగ్గా అలాంటి పాపులారిటీనే భారత్‌కు చెందిన వృద్ధ దంపతులు పొందారు. వివరాలు.. కోల్‌కతాలోని హార్డ్‌ రాక్‌ కెఫే చాలా పురాతనమైనది. కోల్‌కతాకు ఉన్న మరోపేరు ‘సిటీ ఆఫ్‌ జాయ్‌’ మాదిరిగానే.. ప్రతినిత్యం ‘వో చలీ వో చలీ దేఖో ప్యార్‌ కి గలీ’ పాటను పెట్టి ఇక్కడ వచ్చేవారిని మైమరిచిపోయేలా బ్యాండ్‌ ఏర్పాటు చేశారు. 

తాజాగా అదే పాట వింటున్న ఓ వృద్ధ జంట అమాంతం లేచి డ్యాన్స్‌ చేయడం ప్రారంభించారు. చట్టూ జనం ఉన్నారనే సంగతి మరిచి వీరు చేసిన డ్యాన్స్‌ అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది. కెఫేలో ఉన్న వారంతా వీరి డ్యాన్స్‌కు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు.ఈ వీడియోను దిబొహోబాలిక అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ బ్యాండ్‌ తనను 90 ల్లో తన చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చిందని, మరెందరికో మరిచిపోలేని అనుభూతులను పంచిపెట్టిందని రాసుకొచ్చారు.ఈ వీడియోను ఇప్పటివరకు 25 వేల మందికి పైగా వీక్షించారు.చదవండి: అయ్యో పాపం.. మీకు చేతులెలా వచ్చాయి

A post shared by Mamta Sharma Das (@thebohobaalika)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు