Lockdown In Delhi: పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. లాక్‌డౌన్‌ తప్పదా..?

7 Dec, 2021 16:17 IST|Sakshi

ఢిల్లీలో లాక్‌డౌన్‌ అంటూ జోరుగా ప్రచారం

Omicron Scare CM Arvind Kejriwal Clarity On Lockdown: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో లాక్‌డౌన్‌ విధిస్తారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. వీటిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. లాక్‌డౌన్‌ విధేంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 
(చదవండి: ఒకే చోట 281 కేసులు.. లాక్‌డౌన్‌ విధిస్తారా?!)

ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘‘ భయపడాల్సిన పని లేదు. పరిస్థితులను నేను అనుక్షణం సమీక్షిస్తున్నాను. లాక్‌డౌన్‌ విధేంచే ఆలోచన లేదు. కానీ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మాస్క్‌ ధరించండి.. సామాజిక దూరం పాటించండి. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కే మనకు శ్రీరామ రక్ష. సమీక్షా సమావేశాల్లో ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత, మందులు, ఆక్సీజన్‌ లభ్యత వంటి తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. ప్రజలు భయపడాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఉంటే చాలు అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,347 ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూడగా.. భారత్‌లో ఈ సంఖ్య 24కి చేరుకుంది.

చదవండి: వర్క్‌ ఫ్రం హోం.. పరిశ్రమల మూసివేత

>
మరిన్ని వార్తలు