ఒమిక్రాన్‌ అప్‌డేట్స్‌: 57 కొత్త కేసులు.. 415 కు చేరిన మొత్తం సంఖ్య

25 Dec, 2021 11:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కోవిడ్‌ కేసులు థర్డ్‌వేవ్‌కు సంకేతంగా నిలుస్తుండగా.. ఒమిక్రాన్‌ వ్యాప్తి సైతం పరుగులు పెడుతోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 57 ఒమిక్రాన్‌ కేసులు రికార్డు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 415కు చేరింది. బాధితుల్లో 115 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ బులెటిన్‌లో పేర్కొంది. 

అత్యధిక కేసులతో మహారాష్ట్ర (108) తొలి స్థానంలో ఉంది. 79 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా మహారాష్ట్ర నైట్‌ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమలవుతున్నాయి.

ఇక కోవిడ్‌ కేసుల వివరాలు పరిశిలిస్తే.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,189 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,79,815 కు చేరింది. ప్రస్తుతం భారత్‌లో 77,032 యాక్టివ్‌ కేసులున్నాయి. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 15 వేల మంది కోలుకున్నారు. 387 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది.
(చదవండి: Omicron Effect: నూతన సంవత్సర వేడుకలు రద్దు!)

మరిన్ని వార్తలు