ఒకప్పుడు నేరస్తుడు.. ఇప్పుడు అనాథలకు మార్గదర్శకుడు!

5 Oct, 2021 16:02 IST|Sakshi

ఏవో ఏవో కారణాలతో లేక సామాజిక మాధ్యమాల కారణంగానో లేక టెక్నాలజీ కారణంగానో తెలియదు కానీ యువత పెడదోవ పడుతోందంటూ రకరకాల కథనాలను మనం టీవిల్లోనూ, పేపర్లలోనూ చూస్తున్నాం. కానీ కొంతమంది మాత్రమే ఏదో ఒక దశలో తాము మారాలని గట్టిగా నిర్ణయించుకోవటమే కాక మంచి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి చూపిస్తున్నారు. అదే కోవకు చెందిన వారు బెంగళూరుకి చెందిన ఆటో రాజా(థామస్‌ రాజా). అసలెవరా వ్యక్తి ? అతను ఏం చేశాడో కదా!

బెంగళూరు: ఈ ఆటో రాజా అసలు పేరు థామస్‌ రాజా. ఇతను చిన్నతనంలో దొంగతనాలు, చిన్న చిన్న నేరాలు చేస్తుండేవాడు. తన ప్రవర్తన కారణంగా థామస్‌ తండ్రి అతన్ని 16 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి గెట్టేశాడు. అయితే ఈ నేర ప్రవృత్తి కారణంగానే అతను కొన్నాళ్లూ జైల్లో ఉండాల్సి వచ్చింది.  ఈ క్రమంలోనే అక్కడి జైలు వాతావరణం, నేరస్తుల పట్ల పోలీసుల కఠిన వ్యవహార శైలి  తనలో కొత్త జీవన గమ్యానికి నాంది పలికింది. ఆ తర్వాత అతనూ ఇంకెప్పుడూ ఎవర్నీ మోసం చేయడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. 

(చదవండి: నేను గిటారు వాయిస్తాను... మీరు పాట పాడండి ప్లీజ్‌!)

ఆ తర్వాత ధామస్‌ బెంగళూరు వెళ్లి ఒక ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆటో నడుపుకుంటూ వెళ్తున్నప్పుడూ మార్గమధ్యలో  చెత్తకుప్పల వద్ద ఉండే నిరుపేదలు, అభ్యాగ్యులు తరచుగా తనకు తారసపడుతుండే వారు. ఇక అతను తినడానికి కూడా వెళ్లకుండా ఇలాంటి అభ్యాగుల్నీ సుమారు 13 మందిని చేరదీసి వారి కోసం ఒక ఇల్లును అద్దెకు తీసుకుని వారికి ఆశ్రయం ఇస్తున్నాడు.

ఈ మేరకు న్యూ ఆర్క్‌ మిషన్‌ ఆఫ్‌ ఇండియా అనే ఫౌండేషన్‌ సాయంతో "హోమ్‌ ఆఫ్‌హోప్‌"  అనే పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ పునరావాస కేంద్రంలో దాదాపు 750 మందికి ఆశ్రయం ఇచ్చాడు, 19 వేల మంది అనాథలను రక్షించాడు. అంతేకాదు అతను అక్కడితో ఆగిపోలేదు. అభాగ్యుల కనీస భోజనం, తాగునీరు లేక ఖైదీల్లా  జీవిస్తున్నారంటూ... థామస్‌ ఇనుపగొలుసలను ధరించి విన్నూతన రీతిలో వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడు. అయితే అనుకోకుండా అది కాస్త పేపర్లలోనూ, టీవిల్లోనూ బాగా వైరల్‌ అయ్యింది.  ఏదీఏమైనప్పటికీ ఒక చెడు మార్గంనుంచి మంచి మార్గం వైపుకి మళ్లడమే కాక ఒక ఆదర్శవంతమైన గమ్యాన్ని ఏర్పరుచుకుని దాని కోసం పోరాడుతున్న ఆటో రాజా(థామస్‌ రాజా)ను "శభాష్‌" అని అభినందించకుండా ఉండలేం కదా.

(చదవండి: మిస్‌ వరల్డ్‌ అమెరికాగా తొలిసారి భారత సంతతి అమెరికన్‌)

మరిన్ని వార్తలు