కరోనా కాలంలో కొత్త కంపెనీల జోరు

22 Mar, 2021 20:20 IST|Sakshi

2020 ఏప్రిల్ నుండి 2021 ఫిబ్రవరి వరకు 1,38,051 కొత్త కంపెనీలు నమోదయ్యాయని అలాగే 10,113 కంపెనీల కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపార. లోక్‌సభలో కంపెనీల చట్టం, 2013 ప్రకారం సోమవారం అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ప్రజా తనిఖీ కోసం కూడా ఈ వివరాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్ www.mca.gov.inలో లభిస్తాయని ఠాకూర్ చెప్పారు. అలాగే,  పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయం గడిచిన ఆరేళ్లలో 300 శాతం పెరిగిందని ప్రభుత్వం లోక్‌సభకు వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంట్‌ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

చదవండి:

వ్యాక్సిన్‌ పంపిణీలో ముందున్న భారత్

మరిన్ని వార్తలు