10 లక్షల మంది క్రెడిట్ కార్డు వివరాలు లీక్

20 Apr, 2021 20:38 IST|Sakshi

ప్రముఖ పిజ్జా బ్రాండ్ డొమినోస్ సర్వర్ల నుంచి భారీగా డేటా లీక్ అయింది. ఇజ్రాయెల్‌కు చెందిన కో-ఫౌండర్ & సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ హడ్సన్ రాక్, అలోన్ గాల్ చేసిన ట్వీట్ల ప్రకారం.. ఈ డేటా సామర్ధ్యం 13 టెరాబైట్లు(టీబీ). డేటాలో 10 లక్షల యూజర్ల క్రెడిట్ కార్డ్ వివరాలతో సహా 18 కోట్ల మిలియన్ల ఆర్డర్ వివరాలు ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పడు ఈ డేటా మొత్తం డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్లు తెలిపాడు. 

జూమినెంట్ ఫుడ్‌వర్క్స్ డొమినోస్ ఇండియా మాతృ సంస్థ. అలాగే, 250 మంది డొమినోస్ ఉద్యోగుల డేటా కూడా లీక్ అయింది. ఈ డేటా మొత్తాన్ని 550,000 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు అలోన్ గాల్ పేర్కొన్నారు. ఈ డేటా లీక్ ఆరోపణల్ని డొమినో పేరెంట్ కంపెనీ అయిన జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ ఖండించలేదు. కానీ ఫైనాన్షియల్ డేటా లీక్ అయిందన్న వార్తల్ని తిరస్కరించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఇటీవల సమాచార భద్రతా సమస్యను ఎదుర్కొంది. హ్యాకర్లు చేతికి చిక్కిన క్రెడిట్ కార్డ్ డేటా మొత్తం భారతీయ వినియోగదారులదే.

మా నిబందనల ప్రకారం వినియోగదారుల ఆర్థిక వివరాలు లేదా క్రెడిట్ కార్డు డేటాను మేము ఎప్పుడు స్టోర్ చేయలేము. అందువల్ల డేటా లీక్ అయ్యే అవకాశమే లేదని జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. ప్రస్తుతం దీనిపై తమ దర్యాప్తు కొనసాగుతుందని వివరించింది. 10 లక్షలకు పైగా యూజర్ల క్రెడిట్ కార్డుల వివరాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. 18 కోట్ల ఆర్డర్స్ వివరాలు, చిరునామాలు, బిల్లింగ్ డీటెయిల్స్ 10 లక్షల క్రెడిట్ కార్డు వివరాలదే అని యుటిబి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అలోన్ గాల్ ఆదివారం ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో చాలా కంపెనీల డేటా లీక్ అవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.

చదవండి: 

వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోండి!

మరిన్ని వార్తలు