కరోనాతో మూడు నెలల ముచ్చటగా పెళ్లి

1 Jun, 2021 09:02 IST|Sakshi
సూర్యకాంత్‌ గౌడ పెళ్లి నాటి ఫొటో

కరోనాతో ఉపాధ్యాయుడి మృతి

బరంపురం: గంజాం జిల్లా సరగడ సమితిలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యకాంత్‌ గౌడ కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. సమితిలోని చికిలి గ్రామంలో నివాసం ఉంటున్న సూర్యకాంత్‌ గౌడకు మార్చి 10వ తేదీన వివాహం జరిగింది. వివాహం జరిగి మూడు నెలలు కాకముందే ఆయన మృతిచెందిన వార్త జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితుల్లో తీవ్ర విషాదం నింపింది. సూర్యకాంత్‌ గౌడకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ నమోదు కావడంతో జిల్లా కోవిడ్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుదూ సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందారు. అయితే కరోనా భయంతో ఉపాధ్యాయుడి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు, స్నేహితులు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి తహసీల్దార్‌ స్పందించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

చదవండి: తండ్రి సాహసం.. బిడ్డకు ప్రేమతో 300 కి.మీ సైకిల్‌పై..

మరిన్ని వార్తలు