యూపీ ఉభయసభల్లో ఒక్క రోజు మహిళలకే!

23 Sep, 2022 06:15 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఉభయ సభల్లో గురువారం కేవలం మహిళా ప్రజాప్రతినిధులు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. బీజేపీకి చెందిన అనుపమ జైస్వాల్‌ సభకు అధ్యక్షత వహించారు. మహిళా ప్రతినిధుల ప్రసంగాలను అసెంబ్లీ గ్యాలరీలో నుంచి మహిళా వైద్యులు, విద్యార్థినులు, బాలికలు ప్రత్యక్షంగా వీక్షించారు. ముందుగా సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత అఖిలేశ్‌ యాదవ్‌ల ప్రసంగించారు.

ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా మహిళా ఎమ్మెల్యేలు సూచనలు అందజేయాలని సీఎం యోగి కోరారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయాలని అఖిలేశ్‌ యాదవ్‌ ప్రభుత్వానికి సూచించారు. యూపీ అసెంబ్లీలోని 403 మంది సభ్యులకు గాను 47 మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. 100 మందితో కూడిన శాసనమండలిలో ఆరుగురు ఎమ్మెల్సీలున్నారు. 

మరిన్ని వార్తలు