రివర్‌ క్రూయిజ్‌ చిక్కుకోలేదు! భద్రత దృష్ట్యా అలా చేశాం

16 Jan, 2023 21:31 IST|Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద రివర్‌ క్రూయిజ్‌ గంగా విలాస్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లగ్జరీ రివర్‌ క్రూయిజ్‌ ఒకచోట చిక్కుకుపోయిందంటూ వచ్చిన వార్తలు గుప్పుమన్నాయి. కానీ అవి ఎంతమాత్రం వాస్తవం కావని క్రూయిజ్‌ని నిర్వహస్తున్న ఎక్సోటివ్‌ హెరిటేజ్‌ గ్రూప్‌ చైర్మన్‌ రాజ్‌సింగ్‌ చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం ఓడ పాట్నా చేరుకుంది. ఓడ నదిలో లంగరు వేయగా..పర్యాటకులు సందర్శన కోసం పడవలు తీసుకుని బయలుదేరారని తెలిపారు. "ఓడ ఎల్లప్పుడూ ప్రధానంగా లోతైన ప్రదేశంలోనే ఉంటుంది.

పెద్ద ఓడలు ఎప్పుడూ ఒడ్డుకు వెళ్లలేవు. ఈ ఓడను చూడటానికి వేలాదిమంది తరలి వచ్చారు. ఓడ గోప్యత, ప్రయాణికుల భద్రత తదితర కారణాల రీత్యా తాము పాట్నాకి తీసుకువచ్చామని, జెట్టీకి తీసుకురాలేకపోయామని చెప్పారు". అలాగే పర్యాటకులు అక్కడ  చిరాంద్‌ అనే పర్యాట ప్రదేశాన్ని చూడటానికి పడవలను తీసుకుని వెళ్లారని, మళ్లీ సురక్షితంగా తిరిగి వచ్చేశారని వివరణ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్‌లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని షాహిగంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, అస్సాంలోని గౌహతి, బంగ్లాదేశ్‌లోని ఢాకా వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రాంతాలను ఈ క్రూయిజ్ కవర్ చేస్తుంది. శాకాహార భారతీయ వంటకాలు, ఆల్కహాల్ లేని పానీయాలు, స్పా, కాల్‌లోనే అందుబాటులో ఉండే వైద్యులు తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఈ రివర్‌ క్రూయిజ్‌కి రోజుకు సుమరు రూ. 25 వేల నుంచి రూ. 50 వేలు వరుకు ఖర్చు అవుతుంది. మొత్తం 51 రోజుల ప్రయాణానికి ప్రతి ప్రయాణికుడికి దాదాపు రూ. 20 లక్షలు ఖర్చవుతుంది.

(చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు)

మరిన్ని వార్తలు