రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌పై అనుమానాలు.. నో చెప్పిన ప్రతిపక్షాలు

16 Jan, 2023 21:18 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశం ముగిసింది. రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 8 జాతీయ పార్టీలు, 40 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. 

కాగా, ఈ సమావేశం సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆర్వీఎం నమూనాకు ప్రదర్శించింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఆర్వీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశాయి. వలస ఓటర్లపై శాస్త్రీయ సర్వే లేకుండా వారికి ఎలా గుర్తిస్తారని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించాయి. దీంతో, అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించాలని పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో  ఫిబ్రవరి 26 వరకు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలిపేందుకు ఎన్నికల సంఘం గడువు పెంచింది. 
 

మరిన్ని వార్తలు