ఆరెంజ్‌ అలర్ట్‌: ముంబైలో భారీ వర్షాలు

1 Jul, 2022 08:36 IST|Sakshi

ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.  ఈ కుండపోత వర్షాలు కారణంగా నగరం అంతటా రైళ్లు, బస్సు సర్వీసులు దెబ్బతిన్నాయి. ముంబైలోని కుర్లా, చెంబూర్, సియోన్, దాదర్, అంధేరితో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  ఈ మేరకు జులై 1, 2 తేదీల్లో ముంబై నగరంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ.. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు భారీ నీటి ప్రవాహం, వరదలు కారణంగా ముంబై బీఎంసీ పశ్చిమ శివారులోని అంధేరి సబ్‌వేని ట్రాఫిక్ కోసం మూసివేసింది.

అంతేకాదు పలు చోట్ల మోకాళ్ల లోతునీళ్లు ఉండటంతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి నానా ఇబ్బందులు పడ్డారు. ఈ మేరకు ముంబైలోని తూర్పు శివారు ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల ఎడతెరిపిలేకుండా వర్షం కురిసిందని, పైగా గత 12 గంటలలో సుమారు 58.40 మిమీ వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా కల్బాదేవి, సియోన్ ప్రాంతాల్లో రెండు భవనం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఐతే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రభావిత నిర్మాణాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. 

(చదవండి: కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి)

మరిన్ని వార్తలు