క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే!

20 May, 2022 11:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భువనేశ్వర్‌: ఇటీవల కొన్ని వివాహాలు పీటలు వరకు వచ్చి ఆగిపోతున్నాయి. అయితే అందులో కొన్నింటికి వరుడు కారణమైతే, మరికొన్నింటికి వధువు కారణంగా నిలుస్తున్నారు. గతంలో పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెప్తుంటారు. మరి ఇప్పుడు అదే పెద్దలు చూడట్లేదేమో, మండపం వరకు వచ్చిన వివాహాలు చివరి నిమిషంలో పుల్‌స్టాప్‌ పడుతున్నాయి. తాజాగా ఒరిస్సాలోని బాలాసోర్‌ జిల్లాలోనూ ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది.

కల్యాణ ఘడియల శుభవేళలో మంగళ వాద్యాలు మారుమోగుతున్న పెళ్లి పందిరిలో అకస్మాతుగా నిశ్శబ్దం ఆవరించింది. వరుడు సొమ్మసిల్లి పోయాడు. దీంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు. కాసేపటి తర్వాత తేరుకన్న వరుడు వధువు పాపిట కుంకుమ పెట్టే క్షణంలో ఆమె అందరికీ షాకిస్తూ పెళ్లికి నిరాకరించింది. ఇంతకు ముందే తనకు వేరే వ్యక్తితో వివాహం జరిగినట్లు ప్రకటించి వేదిక నుంచి వైదొలగింది. బాలాసోర్‌ జిల్లా బలియాపాల్‌ ఠాణా రెమూ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఊహాతీత ఘటన చోటు చేసుకుంది.

చదవండి: భార్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త ఏం చేసాడంటే?

మరిన్ని వార్తలు