ఈ పాప హాబీ ఏంటో తెలుసా?

19 Dec, 2020 16:10 IST|Sakshi
సేకరించిన అగ్గిపెట్టెలతో దివ్యాన్షి

భువనేశ్వర్‌ : అగ్గిపెట్టెలో పుల్లలు అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేయటం మనకలవాటు. అవసరం తీరిపోయిన తర్వాత వాటి గురించి ఓ క్షణం కూడా ఆలోచించము. అలా ఆలోచించి ఉంటే ఈ పాపలాగ సోషల్‌ మీడియా సెలెబ్రిటీ అయిపోయేవాళ్లం. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కు చెందిన మూడవ తరగతి విద్యార్థిని దివ్యాన్షికి అగ్గిపెట్టెలను కలెక్ట్‌ చేయటం హాబీ. అందుకే ఏకంగా 5 వేల అగ్గిపెట్టెలను కలెక్ట్‌ చేసింది. నేపాల్‌, పోలాండ్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌ దేశాలకు చెందిన అగ్గిపెట్టెలు కూడా అందులో ఉన్నాయి.  దీనిపై దివ్యాన్షి తల్లి గోప మోహంటి మాట్లాడుతూ.. ‘‘ దివ్య తండ్రి చాలా దేశాలు తిరిగేవారు. అక్కడినుంచి తన స్నేహితుడికి అగ్గిపెట్టెలు తెచ్చువారు. వాటి డిజైన్‌ అద్భుతంగా ఉండేది. దీంతో వాటిని తన వద్దనే ఉంచుకుంటానని దివ్య తండ్రిని అడిగింది. అలా గత మూడేళ్ల నుంచి అగ్గిపెట్టెలు కలెక్ట్‌ చేస్తోంది. వాళ్ల నాన్న స్నేహితులు, బంధువులు తన కోసం వాటిని తెస్తుంటారు. మేము వాటిని ప్లాస్టిక్‌ బాక్సుల్లో భద్రంగా ఉంచుతాము’’ మని తెలిపింది.  ( అనకొండకు చిక్కి.. ప్రాణాల కోసం విలవిల )

తన హాబీ గురించి దివ్యాన్షి మాట్లాడుతూ.. ‘‘ మా నాన్న ఓ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌. ఆయన దేశదేశాలు తిరుగుతుంటారు. అక్కడి అగ్గిపెట్టెల్ని ఇంటికి తీసుకొస్తుంటారు. విదేశాలకు వెళ్లే బంధువులు, స్నేహితులను కూడా అగ్గిపెట్టెలు తెమ్మని అడుగుతుంటాను. వారు కూడా తెస్తుంటారు. నాకు ఖాళీ ఉన్న సమయంలో ఈ పనులన్నీ చేసేదాన్ని. వాటిని భద్రపరచటానికి అమ్మానాన్నలు సహాయపడుతున్నారు’’ అని చెప్పింది.

మరిన్ని వార్తలు