7 కిలోమీటర్లు స్టెచ్రర్‌పై మోసుకుంటూ..

16 Jan, 2021 21:42 IST|Sakshi
గర్భిణిని కొండలపై నుంచి మోసుకు వస్తున్న మహిళలు

సాక్షి, భువనేశ్వర్‌ : గిరిజన గ్రామాల్లో గర్భిణులు, రోగుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. తాజాగా ఓ గర్భిణిని కొండలపై నుంచి 7 కిలోమీటర్లు స్ట్రక్చర్‌పై మోసుకు వచ్చిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొరాపుట్‌ జిల్లా బరిణిపుట్‌ పంచాయతీ కొండప్రాంతం లోని లట్టిగుడ గ్రామానికి చెందిన గుప్త జాని భార్య లక్ష్మికి గురువారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. గ్రామానికి చేరుకునేందుకు రహదారి లేకపోవడంతో అక్కడికి వరకు చేరుకోలేమని సిబ్బంది తెలిపారు. దీంతో కొందమంది మహిళలు గ్రామం నుంచి 7 కిలోమీటర్ల స్టెచ్రర్‌పై మోసుకుంటూ కొండ దిగువన ఉన్న రోడ్డుకు చేర్చారు.

అక్కడి నుంచి అంబులెన్స్‌లో జయపురం ఫూల్‌బడి లోని కొరాపుట్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం లక్ష్మీ పండండి బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. కాగా.. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రమంలో ఎవరికి అనారోగ్యం వచ్చినా.. ఇదే పరిస్థితి తలెత్తుతుందని, అధికారులు స్పందించి, రోడ్డు సౌకర్యం కల్పించాలని వారంతా కోరుతున్నారు.

మరిన్ని వార్తలు