7 నెలలకే భర్త పరార్‌.. అత్తవారింటి మెట్లపైన కోడలి పూజలు

26 Nov, 2021 07:48 IST|Sakshi

బరంపురం(భువనేశ్వర్‌): ప్రేమ పేరుతో వంచించి, కోర్టు సమక్షంలో పెళ్లి చేసుకొన్న తన భర్త డాక్టర్‌ సునీత్‌ సాహు మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితులు తపస్విని దాస్‌ న్యాయం పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. స్థానిక బ్రహ్మనగర్‌ 2వ లైన్‌లోని అత్తవారింటి ముందు చేస్తున్న నిరసన దీక్ష గురువారం నాలుగో రోజు కొనసాగింది. మార్గశిర గురువారం సందర్భంగా బాధితురాలు సంప్రదాయ వస్త్రాలు ధరించి, అత్తవారింటి మెట్లపైనే పండ్లు, పలహారాలు, పిండి వంటలతో లక్ష్మీదేవికి పూజలు చేశారు.

అనంతరం మాట్లాడుతూ తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తానని స్పష్టంచేశారు. ఆమె పోరాటానికి ప్రజాసంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా మెలిగిన యువతి తపస్విని దాస్, వైద్యుడు సునీత్‌ సాహు కోర్టు సమక్షంలో రిజిస్టర్‌ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒకే ఇంట్లో కలిసి ఉండి, శారీరకంగా ఒక్కటయ్యారు. ఇలా దాదాపు 7 నెలలు గడిచిన తర్వాత తపస్విని వదిలి, సునీత్‌ సాహు అక్కడి నుంచి పరారయ్యాడు.

చదవండి: స్నేహితురాలితో పెళ్లి.. 7 నెలలు గడిచిన తర్వాత..

మరిన్ని వార్తలు