Orphan Elephant Named Kerrio Who Has Been Paralysed: "ఈ ఏనుగు కథే వేరు"

2 Nov, 2021 21:27 IST|Sakshi

మానవులే చిన్న చిన్న సమస్యలు వస్తే కంగారు పడిపోతాం. ఏదైన వ్యాధి బారినపడితేనే చాలా ఆందోళనకు గురి అవుతాం. మన బంధువులు, స్నేహితులు ధైర్యం చెబితే గానీ కుదుటపడం అలాంటి ఒక చిన్న జంతువు పిల్ల అయితే ఎంత భయపడుతోందో కదా. కానీ ఇక్కడ ఉన్న ఈ అనాథ ఏనుగు పిల్ల కెర్రియో ఎంతో ధైర్యంగా తనకు వచ్చిన వ్యాధిని ఎదుర్కొంటుంది..

(చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!)

పాపం దాని కాళ్లకు పక్షవాతం వచ్చి నిస్తేజంగా ఉండిపోతుంది. కానీ అది దాని సంరక్షకుని సాయంతో ఆ వ్యాధిని జయించడానికి ప్రయత్నించటమే కాక ఏవిధంగానైనా నడవాలని సంకల్పించుకుంటుంది. ఆఖరికి దాని ఉక్కు సంకల్పం ముందు ఆ వ్యాధి పరారై పోయింది. ఎంతో ఉత్సాహంగా నడవడానికి ప్రయత్నిస్తుంది.

ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు ఏ విధంగానైనా జీవితాన్ని కొనసాగించాలనే దాని సంకల్పం గొప్పది అంటూ రకరకాలుగా ట్వీట్‌చేశారు.

(చదవండి: ఛీ నా ఇల్లంతా పాడుచేసి....మొత్తం తినేసింది)

మరిన్ని వార్తలు