పారదర్శకంగా పాలనా వ్యవస్థ

16 Dec, 2022 05:12 IST|Sakshi

మోదీ ‘సుపరిపాలనా వారం’ సందేశం  

న్యూఢిల్లీ:  ప్రజలపై ప్రభుత్వ పరిపాలన ప్రభావాన్ని పెంచడానికి, వారి జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రతిస్థాయిలో విధానాలను, ప్రక్రియలను సులభతరం చేయడం ద్వారా పాలనా వ్యవస్థను పారదర్శకంగా, వేగవంతంగా తీర్చదిద్దడానికి శ్రమిస్తున్నామని అన్నారు. సుపరిపాలనా వారం(సుశాసన్‌ సప్తాహ్‌) సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఈ మేరకు దేశ ప్రజలకు సందేశామిచ్చారు.

దేశవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 25వ తేదీ దాకా సుపరిపాలనా వారం జరుపుకోనున్నారు. ‘ప్రజలే కేంద్రంగా’ కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని మోదీ వివరించారు. ఫిర్యాదుల పరిష్కారం, ఆన్‌లైన్‌ సేవలు, దరఖాస్తుల స్వీకరణ–పరిష్కారం, సుపరిపాలనా విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తుచేశారు. కాలం చెల్లిన వేలాది చట్టాలను రద్దు చేశామన్నారు. అనవసర విధానాలు, పద్ధతులకు స్వస్తి పలికామని వెల్లడించారు. ప్రభుత్వానికి ప్రజలను చేరువ చేయడంలో టెక్నాలజీ పాత్ర చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ప్రజలు సాధికారత సాధించడంలో సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు.  

మరిన్ని వార్తలు