బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!

3 Feb, 2023 12:36 IST|Sakshi

బాల్యవివాహాలపై ఉక్కుపాదం మోపింది అస్సాం ప్రభుత్వం. ఈ బాల్యవివాహాలను పూర్తిగా అణిచివేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పిలుపునిచ్చారు. ఈ విషయంలో పోలీసులు ఓపికతో వ్యవహరించొద్దని చెప్పారు. జీరో టోలరెన్సే లక్ష్యంగా ఈ బాల్యవివాహాలకు చెక్‌పెట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అలాగే బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఈ విషయమై అస్సాం వ్యాప్తంగా సుమారు 1800 మందిని అరెస్లు చేసినట్లు తెలిపారు.,

ఈ మేరకు ముఖ్యమంత్రి బిస్వా ట్విట్టర్‌లో.."బాల్య వివాహాలను అంతం చేయాలనే సంకల్పంలో అస్సాం ‍ప్రభుత్వం చాలా దృఢంగా ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందుకు అందరూ సహకిరించాల్సిందిగా కోరుతున్నా.  ఈ పక్షం రోజుల్లోనే అస్సాంలో దాదాపు 4 వేల కేసులు నమోదయ్యాయి.  ఫిబ్రవరి 3 నుంచి ఆ కేసులపై చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు. ఈ బాల్య వివాహాల విషయంలో నిందితుల పట్ల దయాదాక్షిణ్యాలు చూపించవద్దని నొక్కి చెప్పారు. దీనిపై యుద్ధం సెక్యులర్‌గా ఉంటుందని, ఏ ఒక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకోబోమని వెల్లడించారు.  

అంతేగాదు ఈ విషయాలను ప్రోత్సహించే మత పెద్దలు, పురోహితులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదీగాక అస్సాం మత్రి వర్గం 14 ఏళ్ల లోపు పిలల్లను పెళ్లి చేసుకున్న వ్యక్తులపై పోస్కో చట్టం, బాల్యవివాహాల చట్టం కింద అబియోగాలు మోపి అరెస్టు చేయాలని అస్సాం మంత్రి వర్గం గట్టిగా నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంతి ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వాస్తవానికి అస్సాంలో మాతా, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది. దీనికి బాల్యవివాహాలు ప్రధాన కారణం. అదీగాక రాష్ట్రంలో సగటున 31 శాతం మందికి చిన్న వయసులోనే వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం. 

(చదవండి: రన్నింగ్‌ ఎయిర్‌ ఇండియా విమాన ఇంజిన్‌లో మంటలు.. అలర్ట్‌ అయిన పైలట్‌)

మరిన్ని వార్తలు