కరోనా ఉధృతి: మూడున్నర లక్షలకు పైగా కేసులతో రికార్డు

26 Apr, 2021 11:29 IST|Sakshi

వరుసగా  ఐదవ రోజూ 3 లక్షలకు పైగా కేసులు,  2 వేలకు పైగా మరణాలు

ఏప్రిల్ 15 నుండి రోజువారీ 2 లక్షలకు పైగా కేసులు

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్,  కర్ణాటక మొదటి మూడు స్థానాలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజు కూడా 3లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడం మహమ్మారి ఉధృతికి అద్దం పడుతోంది. దేశంలో కొత్తగా 3,54,653 కరోనా కేసులు నమోదు కాగా 2,808 మరణాలు సంభవించాయి. అయితే నిన్న ఒక్కరోజే 2,19,272 మంది కరోనా నుంచి కోలుకోవడం విశేషం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163గా ఉండగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,95,123కి చేరింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది.  (కోవిడ్‌ సంక్షోభం: సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల సాయం)

మరోవైపు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 14,19,11,223కి చేరింది. దేశంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో 66,191 కేసులతో  మహారాష్ట్ర టాప్‌లో ఉంది.  ఇక్కడ మరణాల సంఖ్య 832గా ఉంది. ఇకదేశ రాజధాని ఢిల్లీ  22,933 కొత్త కేసులు నమోదు కాగా, 350 మంది కరోనాకు బలయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 35వేలు, కర్ణాటకలో 34వేల మందికి కరోనా సోకింది. కేరళ ( 28,469), తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్‌లో కూడా పాజిటివ్‌ కేసుల సంఖ్య తీ​వ్ర స్థాయిలో పెరుగుతోంది. 

తెలంగాణలో కరోనా విజృంభణ
తెలంగాణలో కొత్తగా 6,551 కరోనా కేసులు నమోదుగా, 43 మరణాలు సంభవించాయి. దీంతో  తెలంగాణలో మొత్తం 4,01,783 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 2,042గా ఉంది.తెలంగాణలో ప్రస్తుతం 65,597 యాక్టివ్ కేసులు ఉండగా, 3,34,144 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,418 , మేడ్చల్‌ 554, రంగారెడ్డిలో 482,  నిజామాబాద్‌ 389, వరంగల్ అర్బన్‌లో 329, మహబూబ్‌నగర్‌ 226, ఖమ్మంలో 118 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

చదవండి :  ఆక్సిజన్‌ కొరత: సింగపూర్‌ భారీ సాయం 

పీరియడ్స్‌ టైంలో మహిళలు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా?

మరిన్ని వార్తలు