Dudhsagar Falls: గోవాలో టూరిస్టులకు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్‌

15 Oct, 2022 09:22 IST|Sakshi

Dudhsagar Water Falls.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, వర్షాల నేపథ్యంలో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాల వేళ గోవాలోని దూద్‌సాగర్‌ వాటర్‌ఫాల్స్‌ వద్ద పెను ప్రమాదం తప్పింది. 40 మంది పర్యాటకులను సిబ్బంది కాపాడారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

వివరాల ప్రకారం.. కొద్దిరోజులుగా గోవాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కాగా, శుక్రవారం సాయంత్రం కూడా భారీ వర్షాలు కురవడంతో దూద్‌సాగర్‌ జలపాతం నీటి మట్టం గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వాటర్‌ఫాల్స్‌ చూసేందుకు వచ్చిన 40 మందికి పైగా పర్యాటకులు నీటిలో చిక్కుకున్నారు. నీటిమట్టం పెరగడం వల్ల క్రాసింగ్ కోసం ఉపయోగించిన వంతెన కూలిపోయింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన దృష్టి లైఫ్‌సేవర్స్‌ పర్యాటకులను కాపాడారు. అనంతరం, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

ఈ సందర్భంగా లైఫ్‌సేవర్స్‌.. పర్యాటకులను కాపాడిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఆ ప్రాంతంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, గోవాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంతో కొద్దిరోజుల పాటు దూద్‌సాగర్‌ జలపాతంలోకి ఎవరూ వెళ్లకూడదని దృష్టి లైఫ్‌సేవర్స్‌ హెచ్చరించింది. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ స్పందించారు. ఈ సందర్భంగా పర్యాటకులను కాపాడిన లైఫ్‌ సేవర్స్‌ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు