42.78 కోట్లు దాటిన వ్యాక్సినేషన్‌

25 Jul, 2021 05:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడి కోసం జరుగుతున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటిదాకా అందించిన వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య 42.78 కోట్లు దాటింది. శనివారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 42,78,82,261 వ్యాక్సిన్‌ డోస్‌లను ఇచ్చారు. గత 24 గంటల్లో 42,67,799 వ్యాక్సిన్‌ డోస్‌లను అందించారు. కాగా దేశంలో మహమ్మారి ప్రారంభం నుంచి వైరస్‌ సోకిన వారిలో 3,05,03,166 మంది ఇప్పటికే కోవిడ్‌–19 నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 35,087 మంది రోగులు కోలుకున్నారు. ఇది మొత్తం రికవరీ రేటుని 97.35%కి చేర్చింది. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 39,097 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 27 రోజుల నుంచి 50వేల కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో 4,08,977 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు శనివారం 2.40% వద్ద ఉంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు