అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్‌ మృతి

5 Mar, 2021 18:16 IST|Sakshi

ముంబై సమీపంలోని చిన్న కాలువ దగ్గర మృతదేహం లభ్యం

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ నివాసం 'యాంటిలియా' దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తాజాగా మరో షాకింగ్‌ వార్త వెలుగు చూసింది. అంబానీ ఇంటి ముందు నిలిపిన పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఓనర్‌ మరణించాడు. ముంబైకి సమీపంలోని చిన్న కాలువ దగ్గర అతడి మృత దేహం లభ్యమయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేశారు. 

గత నెల 26న ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియోని నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే.  వాహనం లోపల ఒక బ్యాగును, లేఖను కనుగొ‍న్నారు పోలీసులు. ‘ముఖేశ్‌ భయ్యా, నీతా బాబీ ఇదొక ట్రైలర్‌ మాత్రమే’’ అని లేఖలో  రాసినట్టు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్‌  పరిశీలన తరువాత యాంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా రెండు వాహనాలను ఆపి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఇక దుండగులు వాడిన స్కార్పియోను విఖ్రోలి ప్రాంతం నుంచి దొంగిలించినట్లు దర్యాప్తులో. తాజాగా దాని ఓనర్‌ మరణించడం సంచలనం సృష్టిస్తోంది.

చదవండి:
అంబానీ ఇంటి దగ్గర కలకలం.. ఇది ట్రైలర్‌ మాత్రమే
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు