దూసుకొచ్చిన మహిళా ‘ఆక్సిజన్‌’ రైలు

22 May, 2021 13:39 IST|Sakshi

బెంగళూరు: కరోనా వ్యాప్తి బాధితులకు అందించేందుకు చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడడంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రాణవాయువు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, జార్ఖండ్‌ల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. అయితే తాజాగా చేసిన ఆక్సిజన్‌ సరఫరా ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నది. ఎందుకంటే ఆ ఆక్సిజన్‌ ట్యాంకర్‌లతో కూడిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపిన వారంతా మహిళలే. 

మహిళా పైలెట్లే ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపి ప్రత్యేకత చాటారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌ టాటానగర్‌ నుంచి బయల్దేరిన 7వ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం కర్నాటకలోని బెంగళూరుకు చేరింది. ఆ రైల్‌లో సిబ్బందితో పాటు పైలెట్లంతా మహిళలు ఉండడం విశేషం. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు. 120 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ బెంగళూరు చేరుకుందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు