ఏపీ పోలీసులకు పతకాల పంట

15 Aug, 2022 07:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి చెందిన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ పి.వెంకట్రామిరెడ్డి సేవలను గుర్తించిన కేంద్ర హోం శాఖ ఆయనకు రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ ప్రకటించింది. ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది.

ఏపీకి చెందిన ఏఏసీ మండ్ల హరికుమార్‌కు పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలెంటరీ (పీఎంజీ), జేసీ ముర్రే సూర్యతేజకు ఫస్ట్‌ బార్‌ టు పీఎంజీ, జేసీ పువ్వుల సతీష్‌కు పీఎంజీ ప్రకటించింది. రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ శాంతారావు (ఎస్‌ఎస్‌జీ ఐఎస్‌డబ్ల్యూ, విజయవాడ), ఎస్‌ఐ వి.నారాయణమూర్తి (ఎస్‌ఐబీ, విజయవాడ)లకు పోలీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు దక్కాయి. 

మరిన్ని వార్తలు