పద్మశ్రీ గ్రహీత, డాక్టర్‌ అశోక్ పనగారియా మృతి

11 Jun, 2021 20:56 IST|Sakshi
కోవిడ్‌ అనంతర సమస్యలతో బాధపడుతు మృతి చెందిన డాక్టర్‌ అశోక్‌ పనగారియా

కోవిడ​ అనంతర సమస్యలతో మృతి చెందిన పనగారియా

సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాజస్తాన్‌ సీఎం

జైపూర్: ప్రముఖ న్యూరాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత, డాక్టర్ అశోక్ పనగారియా(71) కోవిడ్ అనంతర సమస్యలతో శుక్రవారం మరణించారు. వైరస్‌ బారిన పడి అనారోగ్యానికి గరైన డాక్టర్ పనగారియా గడిచిన‌ కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. ఇక ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో శుక్రవారం మరణించిన‌ట్లు ఆస్ప‌త్రి వర్గాలు తెలిపాయి.

ప‌న‌గారియా మృతిపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌ధాని స్పందిస్తూ.. వైద్య రంగంలో త‌న కృషి భ‌విష్య‌త్ త‌రాల వైద్యుల‌కు అదేవిధంగా పరిశోధకులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కుటుంబానికి ప్ర‌ధాని త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని తెలిపారు.

రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ పనగారియా మృతి వ్యక్తిగతంగా నాకు, ఆయన కుటుంబానికి తీవ్ర నష్టదాయకం అంటూ సంతాపం వ్యక్తం చేశారు.అలానే ప‌న‌గారియా మృతిపై ఎన‌ర్జీ మినిస్ట‌ర్ బిడి కల్లా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఇతర నాయకులు సంతాపం ప్ర‌క‌టించారు.

చదవండి: కరోనాతో సీనియర్‌ నటుడు కన్నుమూత

మరిన్ని వార్తలు