ప్రధాని మోదీకి వృద్ధురాలి ఆశీస్సులు 

6 Mar, 2021 10:15 IST|Sakshi

ప్రతిరోజూ కష్టపడాలి: పద్మశ్రీ రంగమ్మాళ్‌

చెన్నై : గత కొన్ని రోజుల క్రితం కోవైకు వచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీకి వెళుతున్న సమయంలో విమానాశ్రయంలో కొందరు ముఖ్య ప్రముఖులను కలిశారు. అందులో ఓ నిండు నూరేళ్ల వృద్ధురాలు ఉన్నారు. ఆమెకు మోదీ నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. ఆమె 105 ఏళ్ల రంగమ్మాళ్‌. ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటున్న ఈమె 70 ఏళ్లుగా పొలంలో సంప్రదాయ వ్యవసాయం చేస్తున్నారు. దీంతో ఈమెకు ఈ ఏడాది దేశంలో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. కోయంబత్తూరు మేట్టుపాళయం సమీపంలోగల తేక్కంపట్టికి చెందినవారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఈమె అవ్వ సంరక్షణలో పెరిగింది.

ఆమె నుంచే జీవితాన్ని, వ్యవసాయాన్ని నేర్చుకుంది. వ్యవసాయమే శ్వాసగా బతుకుతున్నారు. పాఠశాల విద్య ఎరుగదు. అయితే, దేశ రాజకీయ, ప్రపంచ విషయాలు తెలుసుకునేందుకు వార్తాపత్రికలు చదివేలా కొంత విద్య అభ్యసించింది. భర్త రామస్వామి ఇదివరకే మృతిచెందారు. సంప్రదాయ వ్యవసాయం ద్వారా ఈ దంపతులు ప్రఖ్యాతులు సాధించారు.

మరిన్ని వార్తలు