జత ఎద్దుల ధర రికార్డు

25 Jan, 2021 08:18 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మాలూరు తాలూకా తేర్నహళ్లి గ్రామంలో శ్రీ సఫళాంబ దేవి జాతరలో ఆదివారం పశువుల  విక్రయాలు జోరుగా సాగాయి. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఎద్దులతో తరలివచ్చారు. బెంగళూరు రూరల్‌ జిల్లా దేవనహళ్లి తాలూకా రెడ్డిహళ్లి గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డికి చెందిన జత ఎద్దులు 10 లక్షల రూపాయలకు అమ్ముడు పోయి రికార్డు సృష్టించాయి.

మరిన్ని వార్తలు