ఎల్‌ఏసీ వద్ద పాకిస్తాన్‌ సైనికులు!

5 Oct, 2020 04:36 IST|Sakshi
వీడియోలో ఉన్న పాక్‌ సైనికుడు (వృత్తంలో)

చైనా జర్నలిస్టు షేర్‌ చేసిన వీడియోలో దృశ్యాలు

న్యూఢిల్లీ/లేహ్‌: భారత్‌–చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా సైన్యంతోపాటు దాని సన్నిహిత మిత్ర దేశం పాకిస్తాన్‌ సైనికులు కూడా తిష్ట వేశారా? చైనాకు మద్దతుగా వారు కూడా పహారా కాస్తున్నారా? చైనా జర్నలిస్టు షెన్‌ షెవీ శనివారం షేర్‌ చేసిన ఓ వీడియోను గమనిస్తే ఇది నిజమేనని స్పష్టమవుతోంది. 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో చైనా సైనికులతోపాటు గుబురు గడ్డంతో ఉన్న మరో సిపాయి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాడు.

అతడి రూపురేఖలు, ఎత్తు, దేహ దారుఢ్యం వంటివి చైనా పౌరుల కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎల్‌ఏసీ వద్ద చైనాకు సాయంగా పాకిస్తాన్‌ సైన్యం సైతం రంగంలోకి దిగిందని పలువురు భావిస్తున్నారు. అలాగే పాకిస్తాన్‌ సైనికులకు చైనా శిక్షణ ఇస్తోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సరిహద్దులో భారత్‌–చైనా సైనికుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

12న భారత్‌–చైనా ఆర్మీ ఏడో రౌండ్‌ చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునే దిశగా భారత్‌–చైనా ఆర్మీ ఏడో దఫా చర్చలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి.తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకునే కచ్చితమైన రోడ్‌ మ్యాప్‌ రూపొందించడమే ఈ సమావేశం ఎజెండా అని విశ్వసనీయ వర్గాల సమాచారం.  సెప్టెంబర్‌ 21వ తేదీన జరిగిన చర్చల్లో సరిహద్దుల్లోకి మరిన్ని అదనపు బలగాలను పంపించరాదనే నిర్ణయంతోపాటు పలు కీలక అంశాల్లో ఏకాభిప్రాయం సాధించారు.

సైన్యం, వైమానిక దళం ఉమ్మడి కార్యాచరణ
తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం దూకుడును అడ్డుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. వైమానిక దళంతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని భావి స్తోంది. సరిహద్దులో చెలరేగిపోతున్న చైనా సైనికులకు తగిన గుణపాఠం నేర్పడానికి భారత సైన్యం, వైమానిక దళం సన్నద్ధమ వుతున్నాయి. త్రివిధ దళాలను ఎప్పటి కప్పుడు సమన్వయ పరుస్తూ ముందుకు నడిపించడానికి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ సూచనలతోనే సైన్యం, వైమానిక దళం కలిసి పని చేయనున్నాయి. లేహ్‌ ఎయిర్‌ ఫీల్డ్‌లో ఇప్పటికే వైమానిక దళం యుద్ధ విమానాలను మోహరించింది.   వాస్తవా« దీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద పరిస్థితి మరింత దిగజారితే వెంటనే ఉమ్మడిగా కొన్ని ఆపరేషన్లు చేపట్టడానికి సైన్యం, వైమానిక దళం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు