కశ్మీర్‌పై పొరుగుదేశం మొసలికన్నీరు

18 Sep, 2020 18:59 IST|Sakshi

ట్విటర్‌లో దుష్ప్రచారానికి సన్నద్ధం

న్యూఢిల్లీ : భారత్‌పై ఆన్‌లైన్‌లో ప్రచ్ఛన్న యుద్ధానికి పాకిస్తాన్‌ ప్రయత్నాలు చేపట్టింది. కశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు పాకిస్తాన్‌ మరోసారి కుటిల నీతికి తెరలేపింది. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 75వ సాధారణ చర్చల సెషన్‌కు ముందు ట్విటర్‌లో భారత వ్యతిరేక ప్రచారానికి పాక్‌ ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌వాంట్స్‌ఫ్రీడం అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌ ప్రచారానికి పాకిస్తాన్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆస్ర్టేలియా, బ్రిటన్‌, కెనడా, అమెరికా, మలేషియా, కువైట్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, భారత్‌, పాకిస్తాన్‌లు కేంద్రంగా భారత వ్యతిరేక ప్రచారాన్ని ట్విటర్‌ ట్రోల్స్‌ సైన్యంతో ముమ్మరం చేసేందుకు పాక్‌ కుయుక్తులు పన్నుతోంది.

కశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ సమాజం ఎదుట దుష్ర్పచారం సాగించేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నించిన ప్రతిసారీ అంతర్జాతీయ వేదికలపై పాక్‌ ప్రయత్నాలు వమ్మయ్యాయి. కశ్మీర్‌ అభివృద్ధికి భారత్‌ చేపడుతున్న చర్యలను తక్కువచేసి చూపాలని పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోందని, కశ్మీర్‌ పరిస్ధితిని వక్రీకరిస్తోందని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వెల్లడించినట్టు టైమ్స్‌ నౌ పేర్కొంది. కశ్మీర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, భారత్‌ అణిచివేత వైఖరి అవలంభిస్తోందని ఐఎస్‌ఐ దుష్ప్రచారం సాగించిందని ఆ అధికారి పేర్కొన్నారు. చదవండి : కంగనా ట్వీట్‌: పాక్‌ జర్నలిస్టుపై నెటిజన్ల ఫైర్‌

మరిన్ని వార్తలు