పాన్-ఆధార్ లింకు గడువును పొడగించిన కేంద్రం

31 Mar, 2021 21:55 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం చివరికి పాన్ కార్డు-ఆధార్ లింకు గడువును పొడిగించింది. కొవిడ్-19‌ నేపథ్యంలో వీటిని లింక్‌ చేసేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కొవిడ్-19 మహమ్మారి వల్ల తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 2021 మార్చి 31 నుంచి 2021 జూన్ 30 వరకు పాన్‌తో ఆధార్ నంబర్‌ను లింక్ చేసే గడువును పొడగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. ఇంతకముందు మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇస్తున్నట్లు పేర్కొన్న కేంద్రం.. ఆ లోగా లింక్‌ చేయకపోతే రూ.1000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.

చదవండి:

గుడ్‌న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

మరిన్ని వార్తలు