‌మా ప్రాణాలు తీస్తారేంట్రా నాయ‌నా

28 Jul, 2020 14:18 IST|Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కాలంలో ప్రతి ఒక్క‌రూ పాక‌శాస్త్ర నిపుణులైన‌ట్లే క‌న‌బ‌డుతున్నారు. ఎన్న‌డూ వంట‌గ‌ది వైపు క‌న్నెత్తి కూడా చూడ‌ని వాళ్లు ఇప్పుడు థింక్ డిఫ‌రెంట్ అండ్ డూ డిఫ‌రెంట్ అన్న‌ట్లుగా వెరైటీ వంట‌కాలు సృష్టిస్తున్నారు. అయితే వాటిని చూస్తే భోజ‌న ప్రియులు కూడా తిండి మానేసేలా ఉన్నారు. ఇప్ప‌టికే వెరైటీ పేరుతో ఎన్నో ప్ర‌యోగాలు సోష‌ల్ మీడియాలో పుట్టుకురాగా తాజాగా మ‌రో భ‌యంక‌ర వంట‌కానికి సంబంధించిన‌ ఫొటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప‌నీర్‌, పాల‌కూర క‌లిపి ఇడ్లీ చేస్తే ఎలాగుంటుంది. అదిగో పై ఫొటోలో చూపించిన‌ట్లు ఎబ్బెట్టుగా ఉంటుంది. రుచి ప‌క్క‌న పెడితే క‌నీసం చూడటానికి బాగుంటేనైనా తిన‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. కానీ ఇది మ‌రీ ఘోరాన్ని చూసిన‌ట్లుగా క‌నిపిస్తుంటే తిన‌డానికి ఎవరు మాత్రం భ‌య‌ప‌డ‌రు. (ఇక డ్రోన్స్‌తో ఫుడ్‌ డెలివరీ!)

నెటిజ‌న్ల‌ను బెంబేలిత్తిస్తున్న ఈ వంట‌కం ఫొటోను ఏఎన్ఐ ఎడిట‌ర్ స్మిత ప్ర‌కాశ్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. అతికొద్ది మంది మాత్ర‌మే దీన్ని ఓసారి ప్ర‌య‌త్నిస్తే పోలా అని ఆలోచిస్తున్నారు. మిగ‌తా అంద‌రూ ఈ టిఫిన్ ద‌రిద్రంగా ఉంద‌ని మొహం చాటేస్తున్నారు. "ఐస్ క్రీమ్ దోశతో పోలిస్తే ఇదే కాస్త న‌యం" అని మ‌రికొంద‌రు స‌ర్ది చెప్తున్నారు. "ఎందుకు నాయ‌నా, ఇలాంటి వంట‌కాల‌తో మా ప్రాణాలు తీస్తారు?", "ద‌క్షిణాది వంట‌కాల‌ను ఖూనీ చేయ‌డం ఆపేయండి", "దీన్ని త‌యారు చేసిన‌వారికి రోజుకు మూడు పూట‌లా ఇదే ఇడ్లీ పెట్టాలి. అదే వారికి స‌రైన శిక్ష అవుతుంది" అంటూ మ‌రికొంద‌రు ఈ వంట‌కంపైనా, దీన్ని త‌యారు చేసిన‌వారిపైనా మండిప‌డుతున్నారు. (గుడ్డుపై వాక్యూమ్‌ క్లీనర్‌ ప్రయోగించాడు!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా