Netaji Jayanti: నేతాజీకి నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

23 Jan, 2023 11:02 IST|Sakshi

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌవది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.  స్వతంత్ర  పోరాటంలో నేతాజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈమేరకు  ఇద్దరు ట్వీట్ చేశారు.

'పరాక్రమ్‌ దివస్ సందర్భంగా భరతమాత ముద్దుబిడ్డ నేతాజీకి నివాళులు. ఆయన ధైర్యసాహసాలు, వీర పరాక్రమం, దేశభక్తి ఆదర్శనీయం. నేతాజీ నాయకత్వంలో లక్షలాది మంది స్వతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు ముందుకువచ్చారు. ఆయనకు భారతీయులంతా ఎప్పటికీ రుణపడి ఉంటారు.' అని ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.

'పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీకి నివాళులు. స్వతంత్ర పోరాటంలో ఆయన భాగస్వామ్యాన్ని స్మరించుకుందాం. బ్రిటిష్ పాలకులపై నేతాజీ వీరోచిత పోరాటం మరువలేనిది. ఆయన కలలుగన్న భారత్‌ను సాకారం చేసేందుకు కృషి  చేస్తున్నాం.' అని మోదీ ట్వీట్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని(జనవరి 23) కేంద్రం పరాక్రమ్ దివస్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: వారణాసిలో సీఎన్‌జీ బోట్లు

మరిన్ని వార్తలు