పార్ల‌మెంట్ భ‌వ‌నంలో భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు: కేంద్రం

29 Jul, 2020 11:48 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్ర‌స్తుత పార్ల‌మెంట్ భ‌వ‌నం చాలా పురాత‌నమైంద‌ని, దీని స్థానంలో కొత్త భ‌వ‌నం ఏర్పాటుకు సంబంధించి కేంద్రం మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టులో  అఫిడవిట్‌ను దాఖలు చేసింది. 100 సంవ‌త్స‌రాలకు పైబ‌డిన ప్లార‌మెంట్ భ‌వ‌నం భ‌ద్ర‌తా ప‌రంగా చాలా ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని పేర్కొంది.  సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌డంతో పాటు అగ్రిప్ర‌మాదాలు త‌లెత్తితే తీవ్ర న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంది. వివిధ అవ‌స‌రాలకు అనుగుణంగా ప్ర‌స్తుత పార్ల‌మెంటు భ‌వానాన్ని కూల్చి కొత్త‌ది నిర్మిస్తామ‌ని సుప్రీంకు వివ‌రించింది. 

'1921లో చేప‌ట్టిన పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణం 1937లో పూర్తైంది. ఇప్ప‌టికే వందేళ్లు గ‌డిచిపోయాయి. కాల‌క్ర‌మేణా పార్ల‌మెంట‌రీ కార్య‌క‌లాపాలు కూడా పెరిగాయి. అందువ‌ల్ల ప్ర‌స్తుత పార్ల‌మెంట్ భ‌వ‌నం సౌక‌ర్యాలు, సాంకేతిక అవ‌స‌రాలను తీర్చ‌లేక‌పోతుంది. 1956లోనూ రెండు కొత్త అంత‌స్తులు క‌ట్టారు. అయితే అగ్ని మాప‌క నిబంద‌న‌లకు త‌గ్గ‌ట్లు ఏమాత్రం లేదు. ఈ ప‌రిస్థితుల్లో త‌ప్ప‌నిస‌రిగా భ‌వనాన్ని కూల్చి కొత్త‌ది నిర్మిస్తాం' అంటూ కేంద్రం  విన్న‌వించింది. (మందిర నిర్మాణంపై శివసేన కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు