ఏర్పాట్లు చేస్తున్నాం

16 Aug, 2020 03:09 IST|Sakshi

సెప్టెంబర్‌లో పార్లమెంటు సమావేశాలు జరగాలి

ప్రభుత్వం నిర్ణయిస్తుంది

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే విషయం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కావలసిన ఏర్పాట్లను మాత్రం లోక్‌సభ స్పీకర్, నేను పర్యవేక్షిస్తున్నాం’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘పార్లమెంట్‌ సమావేశాల నాటికి పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నాం. సెప్టెంబర్‌లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మహమ్మారి సమయంలో కూడా పార్లమెంటు సమావేశాలను విధిగా నిర్వహించాల్సిందే. ఏవైనా మార్పులు తేవాలనుకున్నా.. ఒకసారి సమావేశమై మార్పులు తేవొచ్చు. 

సమావేశాలు నిర్వహిస్తే కనీసం 3 వేల మంది సిబ్బంది పార్లమెంటు ప్రాంగణంలో ఉంటారు. అందువల్ల భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన ఆంక్షలు అమలుచేయాల్సి వస్తుంది. వర్చువల్‌ సమావేశాలు నిర్వహించాలంటూ సలహాలు వస్తున్నాయి. వర్చువల్‌కి, నేరుగా మాట్లాడడానికి చాలా తేడా ఉంది..’అని వెంకయ్య అన్నారు. ఢిల్లీలోని తెలుగు పాత్రికేయులతో ఆయన ఆన్‌లైన్‌లో ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. కరోనా విషయంలో మీడియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని, వార్తల్లో అతిశయోక్తులు వద్దని సూచించారు. 

మరిన్ని వార్తలు