Parliament Monsoon Session 2021: లైవ్‌ అప్‌డేట్స్‌

6 Aug, 2021 12:59 IST|Sakshi

► విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది. 

► పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి

► ఆందోళనల మధ్యే సెంట్రల్ వర్సిటీ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

►గాసస్‌పై విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.

►మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది.

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ శుక్రవారం ప్రారంభమయ్యాయి. వరుసగా 14వ రోజు కూడా పార్లమెంట్‌లో పెగసస్‌ దుమారం రేగుతోంది. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవ్వగా.. రాజ్యసభలో 3 ప్రైవేట్‌ మెంబర్ బిల్లులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టనున్నారు. చిన్నారుల ఉచిత, నిర్బంధ విద్యా సవరణ బిల్లు.. ఐపీసీ సవరణ బిల్లుతోపాటు రాజ్యాంగ సవరణ బిల్లులను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టనున్నారు.

► పాఠశాలలో విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు  తల్లిదండ్రులకు ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వాలని చిన్నారుల ఉచిత, నిర్బంధ  విద్య సవరణ బిల్లు

► 18 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పట్టభద్రులైన  నిరుద్యోగులకు  భృతి ఇవ్వాలని రాజ్యాంగ సవరణ బిల్లు 

► దేవాలయాలు,  ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసే వారికి జైలుశిక్షను రెండు ఏళ్ల నుంచి 20 ఏళ్లకు  పెంచాలని ఐపీసీ సవరణ బిల్లు

అయితే లోక్‌సభ, రాజ్యసభలో పెగసస్‌ స్పైవేర్‌ నిఘా, కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు పట్టిన పట్టు వీడకుండా ఆందోళన కొనసాగిస్తున్నాయి. సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తూ నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో విపక్ష సభ్యులు హోరెత్తించారు. పెగసస్‌ వివాదంపై, రైతుల చట్టాలపై ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఎంతకీ ప్రతిపక్షాలు శాంతించకపోవడంతో ఉభయసభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. 

మరిన్ని వార్తలు